ప‌వ‌న్ మూవీలో అన‌సూయ కీల‌క‌పాత్ర‌

ఈ మ‌ధ్య ప‌వ‌ర్‌స్టార్ క‌ళ్యాణ్ తాను రీఎంట్రీ ఇచ్చిన మూవీ వ‌కీల్‌సాబ్ షూట్ ను పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. మ‌రి ఈ మూవీ స్టార్ట్ చేసి మొద‌ట్లోనే మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను కూడా ద‌ర్శ‌కుడు క్రిష్‌తో ప‌వ‌న్ మొద‌లు పెట్టేసారు. భారీ బ‌డ్జెట్ పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్న ఈ మూవీలో చాలానే ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ప‌వ‌న్‌తో ఇంత‌కు ముందు ఎప్పుడు చెయ్య‌ని యాక్ష‌న్ సీక్వెన్స్ లు మాత్ర‌మే కాకుండా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌రంగా కూడా చాలా బాగుంటుంది తెలుస్తుంది. మ‌రి లేటెస్ట్ గా ఈ మూవీపై మ‌రో టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో గ్లామ‌ర‌స్ యాంక‌ర్ మ‌రియు ప్ర‌ముఖ సినీ న‌టి అనసూయ భ‌ర‌ద్వాజ్ కూడా ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ట్టుగా గాసిప్స్ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సిఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *