ముచ్చ‌ట‌గా మూడోవ చిత్రం…

టాలీవుడ్ అగ్ర హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కీల‌క పాత్ర‌లోవేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న మూవీ వ‌కీల్‌సాబ్ ఈమ‌ధ్య‌నే ఈమూవీకి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయిన విష‌యం తెలిసిందే. తాజ‌గా ఈ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యంది. ఇందులోని ఓ స‌న్నివేశానికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారాయి. అందులో పోలీసులు, విద్యార్థుల మ‌ధ్య‌ఘ‌ర్ష‌ణ జ‌రుగుతుంది. పోలీసుల షీడ్డ్స్ మీద స్టూడెంట్స్ కొడ‌తారు. పోలీస్ అనే లెట‌ర్ మీద కొట్ట‌డం ఇష్టం లేక ప‌వ‌న్ ఆ స్టిక్క‌ర్స్‌ని తొలిగించారు. పోలీస్ శాఖ మీద ఉన్న గౌర‌వంతోనే స్టిక్క‌ర్స్ తీసేయాల‌ని నిర్ణ‌యించారు. ఈఫొటో నెటిజ‌న్ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. బాలీవుడ్లో మంచి విజ‌యం సాధించిన పింక్ మూవీన్ని తెలుగు రీమేక్‌గా ఈ మూవీన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్‌,శృతిహాస‌న్ కాంబినేష‌న్‌లో ఇది మూడో మూవీ, ఇప్ప‌టికే గ‌బ్బ‌ర్‌సింగ్, కాట‌మ‌రాయుడు మూవీల్లో ఇద్ద‌రూ క‌లిసి కనిపించిన విష‌యం తెలిసిందే. దిల్ రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీన్ని త‌మ‌న్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు .ఈ ఏడాదిఆరంభంలో విడుద‌లైన మ‌గువా…. మ‌గువా….పాట ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *