ప‌వ‌న్‌కోసం పూరి ఒక క‌థ‌ను రెడీ చేశాడ‌ట‌…

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మూవీల్లోకి రీఎంట్రీ ఇస్తూ వ‌రుస మూవీల‌కు సైన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో కూడా ప‌వ‌ర్‌స్టార్ న‌టించ‌బోతున్నార‌ని రీసెంట్ రూమ‌ర్స్ వ‌చ్చాయి. అయితే తాజాగా చిత్రా వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం పూరి ప‌వ‌న్‌కోసం ఒక క‌థ‌ను రెడీ చేశాడ‌ని, ఇప్ప‌టికే లైన్ కూడా చెప్పాడ‌ని, పుల్ స్క్రిప్ట్ ర‌మ్మ‌ని ప‌వ‌న్ పూరికి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇక గ‌తంలో ఈ ఇద్ద‌రి కాంబో బ‌ద్రి, కెమెరా మెన్ గంగ‌తో రాంబాబు మూవీలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇక గతంలో మ‌హేష్ బాబుతో చేయాల‌నుకున్న మూవీ జ‌న‌గ‌న‌మ‌ణ ఈ మూవీ స్క్రిప్ట్ నే ప‌వ‌న్‌కి వినిపించాడ‌ట‌. భార‌త దేశంలో అవినీతి జాఢ్యం నేప‌థ్యంలో ఈ జ‌న‌గ‌న‌మ‌ణ క‌థ‌ను పూరి రాస్తున్నాడ‌ట‌. అంటే ఈ క‌థ మొత్తం మ‌న వ్య‌స్థ‌లో లోపాల చుట్టూ, అలాగే మ‌న న్యాయ వ్య‌వ‌స్థ‌లోని డొల్ల‌త‌నం చుట్టూ క‌థ సాగుతుంద‌ట‌. 2022 లో వీరి క‌ల‌యిక‌లో మూవీ ఉంటుంద‌ని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *