ప‌వ‌న్ మాత్రం అందుకు స‌సేమిరా అన్నాడ‌ట టాక్‌…

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్టులు కొత్తేమీకాద‌నే విష‌యం తేలిసిందే. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర‌కు మెగ‌హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ మూవీలు చేయాల‌ని ఆఫ‌ర్ వ‌స్తే మాత్రం తిర‌స్క‌రిస్తాడ‌ట‌. మెగాకాంపౌండ్ నుంచి రామ్‌చ‌ర‌ణ్ , అల్లు అర్జున్‌, వ‌రుణ్‌తేజ్‌, సాయితేజ్ ఇలా యువ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ ప్ర‌తిపాద‌న వ‌స్తే నో చెప్తున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్ లో జోరుగా టాక్ న‌డుస్తోంది. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ అయ్య‌ప్ప‌నుమ్ కొషియ‌మ్ తెలుగు రీమేక్ అంశంలో ఈ సంగ‌తి మ‌రోసారి స్ప‌ష్టమైంది. మొద‌ట‌గా సెకండ్ లీడ్ కోసం వ‌రుణ్‌తేజ్ ను కానీ సాయిధ‌ర‌మ్ తేజ్‌ను కానీ మేక‌ర్స్ తీసుకోవాల‌నుకోగా .. ప‌వ‌న్ మాత్రం అందుకు స‌సేమిరా అన్నాడ‌ట టాక్‌. రానా ద‌గ్గుబాటితో న‌టించేందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూసాడ‌ట‌. అందుకే ఈ మూవీ నిర్మాత‌లు రానాకు రూ.5 కోట్ల‌కు పైగా రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడ‌ట టాక్‌. ఇప్ప‌టికే ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి విక్ట‌రీ వెంక‌టేష్ తో క‌లిసి గోపాల గోపాల మూవీలో న‌టించాడు. ప‌వ‌న్ తాజాగా మ‌రోసారి రానాతో న‌టిస్తుండ‌టంతో… ప‌వ‌న్‌ మ‌ల్టీస్టార‌ర్ మూవీలు కేవ‌లం ద‌గ్గుబాటి కుటుంబంతోనే తీస్తున్నాడంటూ తెగ చ‌ర్చించుకుంటున్నారు సినీ జ‌నాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *