రాశీఖ‌న్నాకు మ‌రోసారి భారీ ఆఫ‌ర్‌…

టాలీవుడ్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న అంద‌చందాల‌తో మెప్పించిన హీరోయిన్ రాశీఖ‌న్నా ఇప్పుడు క్రమంగా త‌మిళ మూవీల‌లో న‌టిస్తూ వ‌స్తున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు రాశీఖ‌న్నాకు మ‌రో భారీ ఆఫ‌ర్ వ‌చ్చింది. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ రూపొంద‌నుంది. ఇందులో రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇంత‌కు ముందు విక్ర‌మ్ ,హ‌రి కాంబినేష‌న్‌లో సామి, స్వామిస్క్వేర్ మూవీలు రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మూడోసారి వీరి క‌ల‌యిక‌లో మూవీ తెకెక్క‌నుంది. నిజానికి హీరో సూర్య‌,హ‌రి కాంబినేష‌న్‌లో అరువా మూవీ చేయ‌డానికి డైరెక్ట‌ర్ హ‌రిస‌ద్దిమ‌య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *