రామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ కొత్త అవ‌తారం…

టాలీవుడ్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసిన‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఎస్ ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీ ఆర్ ఆర్ ఆర్‌మూవీ ఇందులో రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్బంగా మేక‌ర్స్ పోస్ట‌ర్స్ లేదా వీడియోల‌తో అభిమానుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మార్చి 27న రామ్‌చ‌ర‌ణ్ పుట్ట‌న‌రోజు కాగా, ఓ రోజు ముందే అభిమానుల‌ని ఆనందింప‌జేసేందుకు ఆర్ ఆర్ఆర్ నుండి స్ట‌న్నింగ్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. రామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ తాజా అవ‌తారం చూసి ఫ్యాన్స్ తెగ ఆనందిస్తున్నారు. గ‌త సంవ‌త్స‌రం ఎన్టీఆర్ వాయిస్ చ‌ర‌ణ్ కు సంబంధించిన వీడియో ఒక‌టి విడుద‌ల చేయ‌గా, ఇది సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ ఆర్ఆర్ మూవీలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న క‌థానాయిక‌గా అలియాభ‌ట్ న‌టిస్తుంది. ఎన్టీఆర్ మూవీలో కొమురం భీంగా క‌నిపించ‌నున్నారు. కాల్ప‌నిక గాథ ఆధారంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ తెర‌కెక్కుతుండ‌గా, ఈ మూవీన్ని అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. మేక‌ర్స్ ఇదిలా ఉంటే ఆచార్య మూవీలోను రామ్ చ‌ర‌ణ్ ముఖ్య‌పాత్ర పోషించ‌గా ఈ పాత్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్ రేపు విడుద‌ల చేయ‌నున్నారు. చ‌ర‌ణ్ ఇప్పుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప్ర‌తిష్టాత్మ‌క మూవీలో బిజీగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *