బ‌ల్లెం గురిపెట్టి పోరాటానికి సిద్ధ‌మైన‌ట్లు ఉన్న తార‌క్ ..

టాలీవుడ్ మ‌ల్టీసార్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌కమైన ప్రాజెక్ట్‌ను ఎస్ ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వాడి పొగ‌రు ఎగిరేజెండా..వాడిధైర్యం చీక‌ట్ల‌ని చీల్చే మండుటెండ. వాడు భూత‌ల్లి చ‌నుబాబు త‌గిన మ‌న్యం ముద్దుబిడ. నాతమ్ముడు గోండు బెబ్బులి కొముం. భీమ్ అంటూ గ‌త సంవ‌త్స‌రం రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ తో ఎన్టీఆర్ పాత్ర‌ను అభిమానుల‌కు ప‌రిచ‌యం చేసింది. ఆర్ ఆర్ ఆర్ టీమ్ గురువారం ఎన్టీఆర్ పుట్టిన‌రోజు నేప‌థ్యంగా ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌తో యంగ్ టైగ‌ర్ అబిమానుల్ని మ‌రోసారి ఫిదా చేసింది. ఈటీమ్ ఆర్ ఆర్ ఆర్ నుండి ఓ స‌రికొత్త లుక్‌లో నెట్టింట్లో షేర్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ ఉగ్ర‌రూపంలో క‌నిపించారు. బ‌ల్లెం గురిపెట్టి పోరాటానికి సిద్ధ‌మైన‌ట్లు ఉన్న తార‌క్ లుక్ పోస్ట‌ర్ ప్ర‌తి ఒక్క‌రీ ఎంత‌గానో ఆక‌ర్షిస్తోంది. మా భీమ్‌ది బంగారులాంటి మ‌న‌స్సు.కానీ, ఆయ‌నే క‌నుక తిరుగుబాటు చేస్తే బ‌లం, ధైర్యంగా నిలుస్తాడు. అని రాజ‌మౌళి ట్వీట్ చేశారు.యాక్ష‌న్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్‌లోరామ్‌చ‌ర‌ణ్ మ‌రోక‌థానాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాఉ. ఈప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ప్రాజెక్ట్‌ను రాజమౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు సుమారు రూ450కోట్ల బ‌డ్జెట్తో డీవీవీ దాన‌య్య ఆర్ ఆర్ ఆర్ నిర్మిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈసినిమాలో తార్‌కు జంట‌గా హాలీవుడ్ న‌టి ఒలీవియా మోరీస్‌, రామ్‌చ‌ర‌ణ్‌కు జంటగా బాలీవుడ్ భామ ఆలియాభ‌ట్ సంద‌డి చేయ‌నున్నారు. అంతేకాకుండాబాలీవుడ్ ,హాలీవుడ్ కు చెందిన ప‌లువురు న‌టీన‌టులు ఈ మూవీలో కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *