ఇద్ద‌రు హీరోలు ఆన్ లొకేష‌న్ లో…

ఇప్పుడు టాలీవుడ్ హీరోలు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ వీరితో పాటు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌలి ఆర్ ఆర్ ఆర్ అనే బిగ్జెస్ట్ బ‌డ్జెట్ మూవీన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ మూవీ తాలూకా షూట్ కు సంబంధించి కూడా మేక‌ర్స్ ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్స్ ను ఇస్తూ వ‌స్తున్నారు. మ‌రి ప్ర‌స్తుతం గ‌త కొన్ని రోజుల నుంచి భారీ క్లైమాక్స్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తున్న మేక‌ర్స్ లేటెస్ట్ గా కొ కూల్ పోస్ట్ ను త‌మ ఫాలోవ‌ర్స్‌తో పంచుకున్నారు. ఎన్టీఆర్ కొమ‌రాంభీం, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరిగా గా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు హీరోలు ఆన్ లొకేష‌న్ ఫొటోల‌తో ఒక ఫోస్ట్ పెట్టారు. త‌మ భారీ క్లైమాక్స్ సీన్ కోసం తీవ్రంగా క‌ష్ట‌ప‌డి ఆసెష‌న్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నామ‌ని తెలుపుతున్నారు. మ‌రి ఇప్ప‌టికే ఈ సీన్ ను మైండ్ బ్లోయింగ్ విజువ‌ల్స్ మ‌రియు భారీ యాక్ష‌న్ సీక్వెల్ ల‌తో తెర‌కెక్కిస్తున్నారు. మ‌రి ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్‌దేవ్‌గ‌న్ అలాగే అలియాభ‌ట్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే డీవీవీ దాన‌య్య 400 కోట్ల‌కు పై వ్య‌యంతో నిర్మ‌ణం వ‌హిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *