ఎన్టీఆర్ తో మ‌రోసారి కొర‌టాల‌ శివ మూవీ …

టాలీవుడ్ అగ్ర‌హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న తాజా ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో మ‌ళ్ళీ తారక్ వ‌ర్క్ చేస్తుండ‌డం మంచి హాట్ టాపిక్ అయ్యింది. మ‌రి ప్ర‌స్తుతం మ‌ళ్ళీ ఈ సెన్సేష‌న‌ల్ కల‌యిక‌లో రిపీట్ కానుండ‌డంతో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇది వ‌ర‌కే జ‌న‌తా గ్యారేజ్ లాంటి సాలిడ్ స‌బ్జెక్టుతో మంచి ట్రీట్ ఇచ్చాడు. దీనితో ఈ సారి ఎలాంటి కాన్సెప్ట్ తో వ‌స్తారో అన్న‌ది ఆస‌క్తిగా మారింది. మ‌రి ప్ర‌స్తుతం దానికి సంబంధించే తాజా బ‌జ్ ఒక‌టి వినిపిస్తుంది. అయితే ఇందులో ఎన్టీఆర్ బ‌ట‌య ప్రపంచం కోసం పెద్ద‌గా తెలియ‌ని ఓ ఇనోసెంట్ పాత్ర‌లో క‌నిపిస్తాడు అట‌. మ‌రి అలాంటి పాత్ర న‌గ‌ర ప్రాంతాల్లోకి వ‌స్తే ఎలా ఉంటుంది. తాను ఎలా బ్ర‌త‌క‌గ‌లడు అన్న టైప్‌లో ఉంటుందట‌. అయితే ఇలాంటి పాత్ర‌లో ఎన్టీఆర్ ను చూడ‌డం అనేది కాస్త ఇంట్రెస్టింగ్ ఉంది. మ‌రి కొర‌టాల శివ త‌న మార్క్ తో ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *