మాస్ మ‌హారాజా కొత్త మూవీ మొద‌లైంది….

మాస్ మ‌హారాజా రవితేజ క్రాక్ మూవీ షూటింగ్ ని మొత్తానికి పూర్తి చేసి… ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కూడా చెబుతున్నాడు. అయితే క్రాక్ త‌రువాత ఏ మూవీ చేయాలి? ఏ డైరెక్ట‌ర్ తో చేయాలి అనే మీమాంస‌లో గ‌త కొన్ని రోజులుగా ర‌వితేజ స‌త‌మ‌త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ర‌వితేజ డేట్స్ కోసం త్రినాధ్ రామ్‌. ర‌మేష్ వ‌ర్మ ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో ర‌వితేజ మొద‌ట ర‌మేష్ వ‌ర్మ కే ఫిక్స్ అయ్యాడు. అయితే తాజాగా సినీ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం త‌న త‌రువాత సినిమాని ర‌వితేజ, న‌క్కిన త్రినాధ్ రావుతో చేయ‌టానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. కాగా ఈ వార్త‌కు సంబంధించి ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయినా.. దాదాపు ఈ సినిమానే ర‌వితేజ ముందు మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *