నాగ‌చైత‌న్య విక్ర‌మ్ కాంబినేష‌న్‌లో కొత్త మూవీ..

New, movie, in, Nagachaitanya, Vikram, combinationటాలీవుడ్ యంగ్ హీరో నాగ‌చైత‌న్య హీరోయిన్ సాయిప‌ల్ల‌వి కాంబోనేష‌న్‌లో వ‌స్తున్న మూవీ ల‌వ్ స్టోరీ అంద‌రికి తెలిసి విష‌యమే. షూటింగ్ ముగించుకొని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.ఈ మ‌ధ్య కాలంలో క‌థ‌ల విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉంటున్న నాగ‌చైత‌న్య ,మజిలీ త‌రువాత ఆయ‌న కొత్త‌ద‌నం గ‌ల క‌థ‌ల‌ను మాత్ర‌మే ఎంచుకుంటూ విజ‌యాల‌ను అందుకుంటున్నాడు. లవ్ స్టోరీ త‌రువాత మ‌రో రెండుమూవీల‌కు ప్లాన్ చేశాడు. అందులో భాగంగా ఆయ‌న బంగార్రాజు, నాగేశ్వ‌ర‌రావు, మూవీల్లో న‌టించ‌నున్నాడు. ఈ రెండు మూవీల‌తో పాటు చైత‌న్య విక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈసినిమాన్నిథ్యాంక్యూ అనే పేరును నిర్ణ‌యించారు. ఈ మూవీ షూటింగ్ కూడా తాజాగా మొద‌లు పెట్టారు. ఈ విష‌యాన్ని విక్ర‌మ్ కుమార్ స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసాడు. ఇక ఈ మూవీలో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తార‌ని తెలుస్తోంది. వీరిలో ఒక‌రిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ ని ఇప్ప‌టికే ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లొచ్చాయి. మ‌రో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహ‌న్‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్రియాంక గ‌తంలో విక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా వ‌చ్చిన గ్యాంగ్ లీడ‌ర్‌లో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ అందాల భామ ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ శ్రీ‌కారంలో హీరోయిన్‌గా చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *