బాల‌య్య కొత్త మూవీలో నారారోహిత్‌…..

టాలీవుడ్ అగ్ర‌హీరో నంద‌మూరి అంద‌గాడు బాల‌య్య మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ న‌టిస్తున్న మూవీలో మ‌రో హీరో నారారోహిత్ ఓ కిల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌డ‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో టాక్ న‌డుస్తోంది. ఈ మూవీలో నారారోహిత్ క్యారెక్ట‌ర్ ఒక యంగ్ ఎమ్మెల్యే క్యారెక్ట‌ర్ అట‌. కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ అని కూడా తెలుస్తోంది. కాగా ఈ మూవీతో ఓ కొత్త హీరోయిన్‌ను ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు, ఈ చిత్రాన్ని మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించ‌నుండ‌గా సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఇక‌బాల‌య్య కు సింహ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయ‌పాటి ఆ త‌రువాత దాన్ని మించి లెజెండ్ విజ‌యాన్ని అందించారు.కాబ‌ట్టి ఈ సారి లెజెండ్‌ను మించిన హిట్ ప‌డాల‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాల‌య్య కూడా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో పుల్ బిజీ అవుతున్నారు. వ‌చ్చేవారం ఈ చిత్రం షూటింగ్ ను స్టార్ట్ చేయ‌నున్నారు. ఇక తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కుంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఈమేజ్ తెచ్చుకోలేక నారా రోహిత్ ఈ మూవీతో క్రేజ్ తెచ్చుకుంటాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *