క‌థ‌కు గాడ్‌ఫాద‌ర్ అనే టైటిల్ అయితేనే స‌రిగ్గా స‌రిపోతుంద‌ట‌….

టాలీవుడ్ లెజెండ్ హీరో నంద‌మూరి అంద‌గాడు బాల‌య్య‌బాబు, బోయ‌పాటి క శీను కాంబినేష‌న్‌లో ఓ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. బీబీ3 అనే టైటిల్‌తో ప్రచారం జ‌రుపుకుంటున్న ఈ మూవీలో బాల‌కృష్ణ అఘోరా క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. ఈ మూవీకి మోనార్క్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీకీ గాడ్ ఫాద‌ర్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది. బాల‌కృష్ణ ఇమేజ్‌కు, క‌థ‌కు గాడ్ ఫాద‌ర్ అనే టైటిల్ అయితేనే స‌రిగ్గా స‌రిపోతుంద‌ని భావించిన మేక‌ర్స్ ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న మ‌రి కొద్ది రోజుల‌లో రానుంది. ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాణంలో ద్వార‌కా క్రియేష‌న్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతున్న ఈ మూవీకి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూవీకి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, వీడియోలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. మే28న ఈ మూవీ విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *