బాల‌య్య క‌థ బాగా న‌చ్చింద‌ట‌..

టాలీవుడ్ లెజెండ్ హీరో బాల‌కృష్ణ తాజా మూవీపై సినీఇండ‌స్ట్రీలో రోజుకొక రూమ‌ర్ వినిపిస్తోంది. కొత్త‌గా ర‌చ‌య‌త కోన వెంక‌ట్ బాల‌కృష్ణ కోసం ఓ క‌థ‌ను రాశాడ‌ని.. ఇప్ప‌టికే బాల‌కృష్ణ‌కి క‌థ కూడా వినిపించ‌డం జ‌రిగింద‌ని ..కోన క‌థ‌ను బాల‌య్య ఓకే చేసాడ‌ని స‌మాచారం. క‌థ‌లో పుల్ యాక్ష‌న్ తో కూడుకున్న ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ఎలిమెంట్స్ ఉన్నాయ‌ని.. అందుకే బాల‌య్య కు క‌థ బాగా న‌చ్చిందట‌. అన్న‌ట్టు ఈ మూవీకి డైరెక్ట‌ర్ వినాయ‌క్ డైరెక్ట్ చేసే అవ‌కాశం ఉంది. అయితే 2022 సంవ‌త్సరంలోనే ఈ మూవీ సెట్స్ పైకి తీసుకుకెళ్లే ప్లాన్‌లో ఉన్నార‌ట టీమ్‌. బాల‌య్య‌తో వినాయ‌క్ మూవీ అంటూ గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బాల‌య్య కు పెద్ద హిట్ ఇవ్వాల‌నే క‌సితో వినాయ‌క్ ఈ మూవీ చేస్తున్నాడ‌ట‌. మొత్తానికి బాల‌య్య మాత్రం జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస మూవీల‌తో పుల్ బిజీ అవుతున్నారు. ఇప్పుడు బోయ‌పాటి మూవీతో పుల్ బిజీగా ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *