బాల‌య్య మూవీలో క‌న్న‌డ స్టార్ ..

టాలీవుడ్ అగ్ర‌హీరో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న మూవీ నుండి ఇప్ప‌టికే అనేక ర‌కాలుగా చాలా రూమ‌ర్స్‌సోష‌ల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ గురించి మ‌రో ఇంట్ర‌స్టింగ్ రూమ‌ర్ వినిపిస్తోంది. ఈ మూవీలోక‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఓగెస్ట్ రోల్‌లో న‌టిస్తున్నాడ‌ని.. పునీత్ పాత్ర ఇంట‌ర్వెల్ లో వ‌స్తోంద‌ని.. పోలీస్ ఆఫీస‌ర్‌గా పునీత్ క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. అయితే ఈ వార్త పై ఇంకా అధికారక ప్ర‌క‌ట‌న రాలేదు. ఇక ఈమూవీ పుల్ యాక్ష‌న్ తో పాటు ఎమోష‌న‌ల్ గానూ ఉంటుంద‌ని ఇప్ప‌టికే బోయ‌పాటి ఆ మ‌ధ్య ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఈ మూవీన్ని మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించ‌నుండ‌గా త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. బాల‌య్య‌కు సింహా రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయ‌పాటి ఆ త‌రువాత దాన్ని మించి లెజెండ్ విజ‌యాన్ని అందించారు. కాబ‌ట్టి ఈ సారి లెజెండ్ ను మించిన హిట్ ప‌డాల‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాల‌య్య కూడా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస మూవీల‌తో పుల్ బిజీ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *