బాల‌య్య మూవీ రిలీజ్ మే28న‌ ఎన్టీఆర్ జ‌యంతి రోజున అనౌన్స్‌…

టాలీవుడ్ అంద‌గాడు నంద‌మూరి బాల‌య్య బోయ‌పాటి కశ్రీ‌ను కాంబో ఓ మూవీ చేస్తోన్న విష‌యం తెలిసిందే. సింహా, లెజెండ్ లాంటి విజ‌యాల త‌రువాత వ‌స్తున్న మూవీ కావ‌డంతో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్వాజైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. తాజాగా ఈమూవీ విడుద‌ల తేదీని రిలీజ్ చేసింది ద్వార‌కా క్రియేష‌న్స్‌. మే28న స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జ‌యంతి సంద‌ర్భంగా బాల‌య్య సినిమా విడుద‌ల‌వుతుంది. కాగా బిబి3 మూవీన్ని ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌లేదు. టాలీవుడ్ అగ్ర‌హీరోల‌తో పాటు, చిన్న మూవీలు సైతం ముందే విడుద‌ల తేదీని ప్ర‌క‌టించేశాయి. తాజాగా బాల‌య్య మూవీ కూడా వేస‌వి పోరులో ఉండ‌డంతో నందమూరి అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. బాల‌కృష్ణ మూవీ విడుద‌ల‌వుతున్న రోజునే ర‌వితేజ ఖిలాడి మూవీ విడుద‌ల అవుతుండ‌టంతో ఈసారి వేస‌వి పోరు గ‌ట్టిగానే ఉండ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *