మాస్ సాంగ్ అద‌రిపోయే స్టెప్పులు వేస్తున్నా సాయిప‌ల్ల‌వి…..

ఇప్పుడు యంగ్ హీరో నాగ‌చైత‌న్య‌, నాచ్యుల‌ర్‌స్టార్ సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో,ద‌ర్శ‌కుడు శేఖ‌ర్‌క‌మ్ముల తెర‌కెక్క‌స్తున్న మూవీ ల‌వ్‌స్టోరీ విష‌యం తెలిసిందే.ప్రేమ‌క‌థా మూవీగా రూపొందిన ఈ మూవీను ఏప్రిల్ 16న థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌నుండ‌గా , ఈ మూవీకి సంబంధించిన ఒక్కో పాట‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌ను స‌మంత త‌న ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేయ‌డం విశేషం. మంగ్లీ పాడిన సారంగ‌ద‌రియా, అనే మాస్ బీట్ గా సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ పాట‌తో పాటు సాయిప‌ల్ల‌వి ప‌ర్‌ఫార్మెన్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. ఈ మూవీలో ఇద్ద‌రు డ్యాన్స‌ర్ల జీవ‌న శైలిని చూపించ‌నున్నారు. నాగ‌చైత‌న్య‌,సాయిప‌ల్ల‌వి ఇద్ద‌రు తెలంగాణ యాస‌లో మాట్లాడ‌నున్నారు. సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ మ‌రియు అమిగోస్ క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయిన నారాయ‌ణ దాస్ కె.నారంగ్ పుష్క‌ర్ రామ్మోహ‌న్ రావ్ నిర్మాత‌లుగా ఉన్నారు. ఈ మూవీకి ఏఆర్ ర‌హమాన్ శిష్యుడు ప‌వ‌న్ సంగీతం అందిస్తోన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *