ల‌వ్‌స్టోరీ ఏప్రిల్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది….

టాలీవుడ్ యంగ్ హీరో యువ‌సామ్రాట్ అక్కినేని నాగచైత‌న్య‌, న్యాచుల‌ర్ బ్యూటీసాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో డైరెక్ట‌ర్ శేఖ‌ర్‌క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో..సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో… శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ ఎల్ ఎల్‌ల్ పి, ఎమిగోస్ క్రియేష‌న్స్ ప్రె.లి.నిర్మిస్తున్న బ్యూటిపుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్… ల‌వ్‌స్టోరి… ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆక‌ట్టుకున్నాయి.వాలెంటైన్స్ డే కానుక‌గా బ్యూటిపుల్ మెలోడి సాంగ్ రిలీజ్ చేశాడు. ప‌వ‌న్‌ట్యూన్ కంపోజ్ చేయ్య‌గా మిట్ట‌ప‌ల్లి సురేంద‌ర్ లిరిక్స్ రాశారు. అనురాగ్ కుల‌క‌ర్ణి చ‌క్క‌గా పాడారు. నీచిత్రం చూసి నా చిత్రం చెదిరి నే చిత్త‌రువైతిర‌య్యో.. ఇంచు ఇంచులోన ఉన్నా ఈడు నిన్ను ఎంచుకుంది ర‌య్యో.. అంటూ సాగే ఈ ఫీల్‌గుడ్‌సాంగ్ ఆక‌ట్టుకుంటోంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్
ప‌నులు జ‌రుపుకుంటున్న ల‌వ్‌స్టోరీ ఏప్రిల్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *