ఈరోజు నుంచి మూవీ థియేట‌ర్స్ సంద‌డి చేస్తున్నాయి…..

దాదాపు ఏడెనిమిది నెల‌ల‌పాటు మూత‌ప‌డ్డ థియేట‌ర్స్ ఈ రోజు నుండి తిరిగి తెరుచుకుంటున్నాయి. క‌రోనా జాగ్ర‌త్తులు పాటిస్తూ థియేట‌ర్స్ న‌డిపేందుకు యాజ‌మాన్యాలు సిద్ధంగా కాగా, మూవీ ల‌వ‌ర్స్ పెద్ద తెర‌పై మూవీ చూసేందుకు ఉత్సుక‌త‌తోఉన్నారు. మ‌హేష్‌బాబు, రానా, సాయిధ‌ర‌మ్‌తేజ్‌, బెల్లంకొండ సురేష్ ఇలా ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు పెద్ద తెర‌పై మూవీ సెల‌బ్రిట్ చేసుకోమ‌ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తున్నారు. మెగాహీరో సాయిధ‌ర‌మ్ తేజ్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఇంటి నుండి థియేట‌ర్‌కు వెళ్లిన వీడియోని షేర్ చేస్తూ చాలా కాలం త‌రువాత థియేట‌ర్‌కు రావ‌డం సంతోషంగా ఉంది. పెద్ద తెర‌పై మూవీ చూడ‌టం నాకు సంతోషంగా ఉంది. మీలో చాలామందికి అదే అనిపిస్తుందని నాకు తెలుసు.ఈ రోజు నుండి మూవీల‌ను థియేట‌ర్స్ లో చూస్తూ సెల‌బ్రేట్ చేసుకుందాం అని పేర్కొన్నారు. తేజూ న‌టించిన సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ మూవీ డిసెంబ‌ర్ 25న విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *