సినీన‌టుడు న‌ర్సింగ్ యాదవ్ (52) క‌న్నుమూశారు…

హైదరాబాద్‌: సినీనటుడు నర్సింగ్‌ యాదవ్‌ (52) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చేరిన ఆయన.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పలు సినిమాల్లో కామెడీ, విలన్‌ పాత్రల్లో నర్సింగ్ నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 300 చిత్రాల్లో ఆయన నటించారు. ‘నర్సింగ్‌ యాదవ్‌ 1968 జనవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు. హేమాహేమీలు’ చిత్రంలో నర్సింగ్ సినీరంగ ప్రవేశం చేశారు. అనంతరం నటుడిగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆయనకు బ్రేక్‌ ఇచ్చారు. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన ‘క్షణక్షణం’లో నర్సింగ్‌ నటించారు. అనంతరం మాయలోడు, అల్లరిప్రేమికుడు, ముఠామేస్త్రి, మాస్టర్‌, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఇడియట్‌, గాయం, పోకిరి, యమదొంగ, అన్నవరం, జానీ, ఠాగూర్‌, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ తదితర చిత్రాల్లో ఆయన కీలక పాత్రల్లో మెప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *