చిరు కొత్త మూవీ ప‌ట్టాలు ఎక్క‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌నుంద‌ట‌…

More, time, to ,climb, the, new, movie, titles,Megastar Chiranjeevi,Luciferటాలీవుడ్ అగ్ర‌హీరో మెగాస్టార్ చిరంజీవి వ‌రుస మూవీల‌తో బాగా బిజీ అయ్యాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆచార్య సినిమాకోసం చిరు తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు. అయితే దీని త‌రువాత లూసిఫ‌ర్ సినిమాను తీసేందుకు చిరు ఆస‌క్తి చూప‌డంతో మ‌ళ‌యాళంలో భారీ హిట్ అయ‌ని ఈ మూవీ రీమేక్ హ‌క్కుల‌ను రామ్‌చ‌ర‌ణ్ సాధించాడు. అయితే ఈ మూవీకి స‌రైన ద‌ర్శ‌కుడి కోసం వేట మొద‌లుపెట్టారు. ముందుగా సుజిత్‌కు ఈ ప్రాజెక్ట్‌ను అప్ప‌జెప్పారు. తెలుగు ప్రేక్ష‌కుల‌ను అనుగుణంగా క‌థ‌లో సుజిత్ మార్పులు చేశాడు. ఆ మార్పుల‌తో చిరు సంతృప్తి చెంద‌క‌పోవ‌డంతో మ‌రో ద‌ర్శ‌కుడిని క‌లిసారు. ఈ సినిమాను అనుభ‌వం ఉన్న వీవీ వినాయ‌క్‌కు ఇవ్వాల‌ని చిరు ఆలోచ‌న చేశారు. కానీ త‌రువాత మోహ‌న్ రాజాను క‌లిసారు. అత‌డు ప్రస్తుతం మార్పులు చేర్పులు చేయ‌డంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ లేట్ అవ్వ‌డంతో ఇరు త‌న షెడ్యూలో వేరే పేరును ముందుకు తీసుకొచ్చాడు. దీంతో ఈ మూవీ ప‌ట్టాలు ఎక్క‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌నుంద‌ని స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *