ఆ పాత్ర త‌న‌కు సూట‌వుతుంద‌ని భావించిన చిరు…

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త‌మిళ హిట్ మూవీ వేదాళం రీమేక్‌ను డైర‌క్ట‌ర్ మెహ‌ర్‌ర‌మేష్ డైరెక్ట్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లిన విష‌యం తెలిసిందే. మెగాస్టార్ లేని సీన్స్‌ను మోహ‌ర్ ర‌మేష్ ఇప్ప‌టికే షూట్ చేశారు. కాగా తాజాగా లేటెస్ట్ డేట్ ఏమిటంటే… ఈ మూవీలో ఓ కీల‌క సీక్వెన్స్ వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో న‌డుస్తోంద‌ట‌. ఈనేప‌థ్యానికి క‌థ‌కు మ‌ధ్య ప్ర‌త్యేక లింక్ ఉంటుంద‌ట‌. వార‌ణాసి నేప‌థ్యాన్ని క‌థ‌లో యాడ్ చేస్తున్నార‌ట‌. ముందుగా చిరు ఈ సీక్వెన్స్ నే స్టార్ట్ చేస్తార‌ట‌. ఇక 2015లో అజిత్ హీరోగా వ‌చ్చిన వేదాళం మూవీ భారీ విజ‌యాన్ని అందుకుంది. ఆ మూవీలో అజిత్ మాస్ రోల్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఫిదా చేసింది. ఆ పాత్ర‌కు త‌న‌కు సూట‌వుతుంద‌ని ఆ మూవీలోఅజిత్ మాస్ రోల్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఫిదా చేసింది. ఆ పాత్ర‌కు త‌న‌కు సూట‌వుతుంద‌ని భావించిన చిరంజీవి ఈ మూవీ రీమేక్ లో న‌టించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అలాగే ఈ మూవీలో చిరు సోద‌రి రోల్‌కు సాయి ప‌ల్ల‌విని ఎంపిక చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ మూవీన్ని మ‌ణిశ‌ర్మ సంగీతం అందివ్వ‌నున్న‌ట్టు టాక్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *