లూసిఫ‌ర్ రీమేక్ నే టేక‌ఫ్ చెయ్యాల‌ని భావిస్తున్నాకర‌ని టాక్‌..

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య అనే భారీ బ‌డ్జెట్ మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక అలాగే దీని త‌రువాత చిరు రెండు రీమేక్ మూవీలు లైన్ లో పెట్టుకున్నారు.మ‌రి అలాగే ఆచార్య లైన్ లో ఉండ‌గానే టేక‌ప్ చేసిన ఈరెండు రీమేక్ మూవీల విష‌యంలో ఒక్కో స‌మ‌యానికి ఒక్కోవిధంగా ప‌రిస్థితులు మారాయి. ముఖ్యంగా లూసిఫ‌ర్ రీమేక్ విష‌యంలో అయితే పెద్ద డ్రామానే న‌డిచింది. ప‌లు ద‌ర్శ‌కుల నుంచి మార‌డ‌మే కాకుండా త‌రువాత టేక‌ప్ చేసే ప్రాజెక్ట్ నుంచి చేంజ్ అయ్యి వేదాళం మొద‌టి వ‌రుస‌లోకి వ‌చ్చింది. ఇక అదే అనుకుంటే ప్ర‌స్తుతం చిరు మ‌ళ్ళీ త‌న ప్లాన్ ను మార్చిన‌ట్టుగా తెలుస్తుంది.చిరు ఆచార్య కంప్లీట్ అయ్యాక మొద‌ట లూసిఫ‌ర్ రీమేక్ నే టేక‌ఫ్ చెయ్యాల‌ని భావిస్తున్నాకర‌ని టాక్‌.దాని త‌రువాత నే వేదాళం రీమేక్‌స్టార్ట్ చేయ‌నున్నార‌ట‌.మ‌రి చిరు మొద‌ట ఏ ప్రాజెక్ట్ ను టేక‌ప్ చేయ‌నున్నారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *