మెగా ఫ్యామిలీ స‌భ్యులు అంతా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు…

ఇప్పుడు టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి పెళ్ళి వేడుక కోసం మెగా ఫ్యామిలీ స‌భ్యులు చిరంజీవి, సురేష్‌, నాగాబాబు, ప‌ద్మ‌జ‌, అల్లు అర‌వింద్ దంప‌తులు, రామ్‌చ‌ర‌ణ్ ,ఉపాస‌న‌, అల్లు అర్జున్‌, స్నేహ్న రెడ్డి , బాబీ ఫ్యామిలీ, శిరీష్‌, చైత‌న్య ఫ్యామిలీ అంతా సోమ‌వారం రాజ‌స్థాన్ చేరుకున్నారు. ఇక ఈ రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తుంది. ఈ కార్య‌క్ర‌మంలో మెగా ఫ్యామిలీ స‌భ్యులు అంతా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. పిల్ల‌లు రామ్ చ‌ర‌ణ్ మూవీలోని పాట‌కు డ్యాన్స్ చేశారు. మ‌హిళ‌లు కూడా చిందులేశారు. వీరి సంద‌డికి సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలోహ‌ల్ హ‌ల్ చేస్తున్నాయి. ఇక రాజ‌స్థాన్‌లోని హోట‌ల్ లో దిగిన వెంట‌నే నిహారిక‌, చైతూల‌కి అక్క‌డి బ్యాండ్ మేళం బృందం ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌గా, జోష్‌లో ఉన్న నిహ‌రిక‌, చైత‌న్యతో క‌లిసి చిందులేసింది.నిహారిక సంగీత్ వేడుక‌..రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన మెగా ఫ్యామిలీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *