మాస్ట‌ర్ టీజ‌ర్ భారీ రికార్డును సెట్ చేసింది…

కోలీవుడ్‌లో అగ్ర‌హీరో ఇళ‌య‌థ‌ల‌ప‌తి విజ‌య్ ఎలాంటి రికార్డులైనా పెట్టింది పేరు.ఆయ‌న ఒక్క బాక్సాఫీస్‌
ద‌గ్గ‌రే కాకుండా స్మాల్ స్ట్క్రీన్‌, సోష‌ల్ మీడియాల‌లో కూడా విజ‌య్ భారీ రికార్డులే ఉన్నాయి. అలా తాను న‌టించిన లేటెస్ట్ మూవీ మాస్ట‌ర్ టీజ‌ర్‌తో సెన్సేష‌న‌ల్ రికార్డుల‌ను సెట్ చేశారు. స్టార్టింగ్ లోనేవ్యూస్ మ‌రియు లైక్స్ ప‌రంగా మ‌న ఇండియాలోనే భారీ రికార్డులు సెట్ చేసిన ఈ టీజ‌ర్ ఇప్పుడు మ‌రో ఇండియ‌న్ రికార్డును నెల‌కొల్పిన‌ట్టు తెలుస్తుంది. ఈ టీజ‌ర్‌కు ఏకంగా 5ల‌క్ష‌ల‌కు పైగా కామెంట్స్ రావ‌డంతో ఈ టీజ‌ర్ మోస్ట్ కామెంటెడ్ ఇండియ‌న్ టీజ‌ర్‌గా నిలిచింది. ఈ దీనితో విజయ్ ఖాతాలో మ‌రో రికార్డు ప‌డ్డ‌ట్టు అయింది.ఇక ఈ మూవీన్ని లోకేష్ క‌న‌గ్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా అనిరుధ్ సంగీతం అందించారు. అలాగే మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి స్ట్రాంగ్ విల‌న్ రోల్‌లో న‌టించ‌గా మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్ న‌టించింది. మ‌రి భారీ అంచ‌నాల‌ను సెట్ చేసుకున్న ఈ మూవీ వ‌చ్చే సంవ‌త్స‌రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *