అక్ష‌రాల 60ల‌క్ష‌ల మంది అభిమానుల‌ను సొంత చేసుకున్న సూప‌ర్‌స్టార్‌…

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. స‌మాజంలో జ‌రుగుతున్న స‌మ‌స్య‌ల‌పై సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తూనే త‌న మూవీ, ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను కూడా తెలియ‌జేస్తుంటారు. తాజాగా మ‌హేష్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో 6మిలియ‌న్ క్ల‌బ్ లో చేరాడు. అంటే ఇప్పుడు మ‌హేష్ ని న్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య అక్ష‌రాల 60 ల‌క్ష‌లు అన్న‌మాట‌. ట్విట్ట‌ర్‌లోను 10.9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌తో దూసుకుపోతున్నాడు. మ‌హేష్. ట్విటర్ ద‌క్షిణాది న‌టుల‌కు అంత ఎక్కువ ఫాలోవ‌ర్స్ లేరు. మ‌హేష్ మూవీల విష‌యానికి వ‌స్తే ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప‌ల‌క‌రించిన మ‌హేష్ ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట చిత్రంలోబిజీగా ఉన్నాడు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో మొద‌లు కానుంది . ఇటీవ‌ల చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లు కాగా, ఈ కార్య‌క్ర‌మానికి న‌మ్ర‌త‌, సితార ముఖ్యఅతిథులుగా హాజ‌ర‌య్యారు. త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగ‌దాస్‌లో మ‌హేష్ ఓ సినిమాకు సంత‌కం చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో కూడా మ‌హేష్ ఓ సినిమా చేయ‌నున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *