మ‌హేష్‌బాబు , త్రివ్రిక‌మ్ కాంబినేష‌న్‌లో కొత్త మూవీ….

టాలీవుడ్ అగ్ర‌హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు, ప‌ర‌శురామ్ కల‌యిక‌లో వ‌స్తున్న మూవీ స‌ర్కారు వాటిపాట సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ త‌రువాత ప్రిన్స్ ఏ మూవీ చేయ‌నున్నాడ‌నే స‌స్పెన్స్ కొన‌సాగుతూనే వుంది. కాగా మాట‌ల మాంత్రికుడు త్రివ్రిక‌మ్ తో మ‌హేష్ మూవీ ఉండ‌నుంద‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్న‌టికి.. అధికార‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చే దాకా న‌మ్మ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఎందుకంటే ఇదివ‌ర‌కు కూడాయంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తోను త్రివిక్ర‌మ్ మూవీ వుండ‌నుంద‌నే ప్ర‌చారం పెద్ద‌గానే జ‌రిగింది. తీరా చూస్తే తారక్, కొర‌టాల‌శివ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ జ‌రిగింది. ఇదిలావుంటే, శ‌నివారం మ‌హేష్-త్రివిక్ర‌మ్ మూవీ అధికార ప్ర‌క‌ట‌న ఉండ‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదివ‌ర‌కు అయితే మే30 న అనౌన్స్‌మెంట్ ఉండొవ‌చ్చ‌ని తెలుస్తోండ‌గా ..శ‌నివారం అప్డేట్ అంటూ ప్రచారం న‌డుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *