ఆయ‌న‌కు క‌థ రాయ‌డం చాలా క‌ష్టం……

టాలీవుడ్ అగ్ర‌హీరో మ‌హేబాబు ,కీర్తిసురేష్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ స‌ర్కారివారిపాట వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ బాబు నుండి ఒక పాన్ ఇండియ‌న్ మూవీ కోసం అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న నేప‌థ్యంలో ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళితో కాస్త ఆల‌స్యం అయినా అనౌన్స్ చేసేసారు. అయితే అస‌లు మ‌హేష్ కి క‌థ రాయ‌డ‌మే క‌ష్టం అంటున్నారు. బ‌హుబ‌లి లాంటి ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ కి క‌థ అందించిన ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారు. రాజ‌మౌళి ప్ర‌తి మూవీకి క‌థ అందించే ఆయ‌న ఆలీతో స‌ర‌దాగా ప్రోగ్రాంలో ఆ మాట‌ను చెప్పారు.మ‌హేష్ కి క‌థ రాడం చాలా ట‌ఫ్ జాబ్ అని తెలిపారు.అలాగే మ‌హేష్‌కి క‌థ రాయాలి అంటే డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ స‌ల‌హా తీసుకోవాల‌ని న‌వ్వుతూ అనేసారు.అయితే ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే రాజ‌మౌళితో తీయ‌బోయే మూవీకి కూడా ఆయ‌న‌నేక‌థ ఇస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి సెన్సేష‌న‌ల్ క‌ల‌యిక‌లో మ‌హేష్ క‌టౌట్‌కి ఎలాంటి క‌థ‌ను సిద్ధం చేస్తున్నారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *