సూప‌ర్‌స్టార్ మ‌ళ్ళీ హాలీవుడ్ లెవెల్ యాక్ష‌న్ సీక్వెన్స్ ….

ప్ర‌స్తుతం సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు,కీర్తిసురేష్ కాంబేనేష‌న్‌లో వ‌స్తున్న మూవీ స‌ర్కార్ వారి పాట‌.. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ పెట్ల తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం దుబాయ్ షెడ్యూల్‌లో బిజీబిజీగా ఉంది. అయితే నిన్న‌నే మ‌హేష్ ఈ షెడ్యూల్ లోని సార్జా ఎడారిలో షూట్ కు సంబంధించి ఫొలోల‌ను మ‌హేష్ షేర్ చేసుకున్నారు. అయితే ఈ సీక్వెన్స్‌కు సంబంధించి మ‌రిన్ని ఇంట్రెస్టింగ్ డెవ‌లెప్మెంట్స్ వినిపిస్తున్నాయి. అక్క‌డి షూట్ తాలూకా ఫొటోలే కాకుండా ఆన్ లొకేష‌న్ వీడియో కూడా బ‌య‌ట‌కొచ్చింది. ఇవ‌న్నీ చూస్తుంటే మ‌హేష్ తో మ‌ళ్ళీ ఓ హాలీవుడ్ లెవెల్ యాక్ష‌న్ సీక్వెన్స్ తీస్తున్న‌ట్టు అనిపిస్తుంది. మ‌న తెలుగులో ఓహీరో యాక్ష‌న్ స్టంట్స్ చేస్తే ఆన్ స్క్రీన్‌పై సూప‌ర్బ్‌గా అనిపించేవారిలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా ఒక‌రు. మ‌రి మ‌హేష్ నుంచి అప్పుడెప్పుడో ట‌క్క‌రి దొంగ .. అనేనొక్క‌డినే.. మూవీలలో మంచి మైండ్ బ్లోయింగ్ హాలీవుడ్ లెవెల్ యాక్ష‌న్ సీక్వెన్స్‌లు చూసాం. మ‌రి ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట ఈ షూట్ స్పాట్ లో కార్లు రేస్ బైక్ ల‌తో సెట‌ప్ చూస్తుంటే గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్న‌ట్టు అనిపిస్తుంది. మ‌రి ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుందో తెలియాలి వ‌చ్చే సంవ‌త్స‌రం సంక్రాంతి వ‌ర‌కు ఆగాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *