మ‌న ఇద్ద‌రి భావ‌న ఒక్క‌టే..!

హైద‌రాబాద్ఃసూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ఉద్దేశిస్తూ బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్‌సింగ్ ఓపోస్ట్ పెట్టారు. మ‌హీతో క‌లిసి ప‌నిచేయ‌డం త‌న‌కెంతో ఆనందంగా ఉంద‌ని అన్నారు. అంతేకాకుండా మ‌హీని బిగ్ బ్ర‌ద‌ర్ అంటూ వ‌రుస క‌లిపారు. తాజాగా ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న కోసంతొలిసారి వీరిద్ద‌రూ క‌లిసి ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ర‌ణ్‌వీర్ ..మ‌హేష్‌తో దిగిన ఓఫొటోని ఇన్‌స్ట్రా వేదిక‌గా షేర్ చేశారు. నేను క‌లిసి ప‌నిచేయాల‌నుకునే, క‌లిసి ప‌నిచేసిన గొప్ప వ్య‌క్తుల్లో ఒక‌రు మ‌హేష్‌బాబు. మ‌న ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ‌లు ఎప్ప‌టికీ విలుపైన‌వే. బిగ్ బ్ర‌ద‌ర్ ప‌ట్ల నాకెంతో ప్రేమ‌భిమానాలు ఉన్నాయి.అని ర‌ణ్‌వీర్ వెల్ల‌డించారు. కాగా, ర‌ణ్ వీర్ షేర్ చేసిన పోస్ట్‌పై మ‌హేష్ స్పందించారు. బ్ర‌ద‌ర్ నీతో క‌లిసి పనిచేయ‌డం నాకెంతో గొప్ప‌గా అనిపించింది. మ‌న ఇద్ద‌రి భావ‌న ఒక్క‌టే.!అని రిప్లై ఇచ్చారు. ప్ర‌స్తుతం మ‌హేష్ ‌మ‌రియు ఫొటో సూప‌ర్‌స్టార్ అభిమానుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. మ‌రోవైపు మ‌హేష్ స‌ర్కార్ వారి పాట కోసం సిద్ద‌మ‌వుతున్నారు. ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ మూవీలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్త సురేష్ సంద‌డి చేయ‌నున్నారు. ర‌ణ్‌వీర్ సింగ్ నటించిన 83 విడుల‌కు సిద్దంగా ఉంది. అలాగే సూర్య‌వంశీ, స‌ర్క‌స్ చిత్రాలు చిత్రీక‌ర‌ణ‌లో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *