లూసిఫ‌ర్ మూవీలో హీరో చెల్లిగా సుహాసిని న‌టిస్తున్న‌ట్లు టాక్‌

టాలీవుడ్ అగ్ర‌హీరో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య మూవీ అని అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఖైదీ నెంబ‌ర్150 మూవీతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి జోరు మీదున్నారు. వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కు ప‌సందైన వినోదం అందిస్తున్నారు.ఇప్పుడు ఆచార్య మూవీ చేస్తున్న మెగాస్టార్ దీని త‌రువాత లూసిఫ‌ర్,వేదాళం రీమేక్‌లు చేయ‌నున్నాడు. అయితే లూసీఫ‌ర్ రీమేక్ బాధ్య‌త‌ల‌ను మోహ‌న్‌రాజాకు అప్ప‌గించాడు. చిరుకు త‌గ్గ‌ట్టు క‌థ‌లో మార్పులు చేస్తున్న మోహ‌న్ రాజా జ‌న‌వ‌రి 20నుండి ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తుంది. లూసిఫ‌ర్ మూవీలో మంజు వారియ‌ర్‌…. హీరోకి చెల్లి పాత్ర‌లో న‌టించింది. తెలుగులో సుహాసిని చెల్లె పాత్ర పోషించ‌న్నుట్టు టాక్‌. స‌త్య‌దేవ్ ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడు. ఈ మూవీన్ని ఎన్వీ ప్ర‌సాద్‌తో క‌లిసి కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే వేదాళం మూవీన్ని మెహార్ ర‌మేష్ ద‌ర్శ‌కత్వంలో చిరంజీవి రీమేక్ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందులో బిగ్‌బాస్ బ్యూటీ దివి ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *