ఆయ‌న చెప్పిన క‌థ న‌చ్చింది…….

ప్ర‌స్తుతం అగ్ర‌హీరో విజ‌య్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట‌ర్ మూవీన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. షూటింగ్ మొత్తం పూర్తి అవ‌డంతో విడుద‌ల స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. థియేట‌ర్లు రీ ఓపెన్ అవ‌గానే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తారు.ఇదిలా ఉండ‌గా విజ‌య్ త‌రువాతి చిత్రంను ఎవ‌రు చేస్తార‌నే విష‌య‌మై చాలా రోజుల నుంచి స‌స్పెన్స్ నెల‌కొన్న విష‌యం తెలిసిందే. మొద‌ట మురుగ‌దాస్ అనుకున్నారు.కానీ కొన్ని క్రియేటివ్ డిఫ‌రెన్స్‌స్ కార‌ణంగా ఆయ‌న ప్రాజెక్టు నుండి త‌ప్పుకున్నారు. త‌రువాత నెల్స‌న్ దిలీఫ్ కుమార్ పేరు వినిపించినా ఖ‌చ్చిత‌మైన క‌న్ఫ‌ర్మేష‌న్ రాలేదు. మ‌ళ్ళీ మ‌ధ్య‌లో అట్లీ పేరు కూడా తెర‌మీద‌కొచ్చింది. తాజాగా నిర్మాణ సంస్థ స‌న్‌పిక్చ‌ర్స్ విజ‌య్ 65వ మూవీన్ని తామే నిర్మ‌స్తున్నామ‌ని , ఈ మూవీన్ని ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీఫ్‌కుమార్ అని ప్ర‌క‌ట‌న చేయ‌డం జ‌రిగింది. దిం తో కొన్ని దినాలుగా ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. నెల్స‌న్ దిలీప్ కుమార్ కొల‌మావు కోకిల మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయ‌న చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో విజ‌య్ ఆయ‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ భారీ బ‌డ్జెట్ మూవీన్ని అనిరుద్ సంగీతం అందివ్వ‌నుండ‌గా మ‌నోజ్ ప‌ర‌మ‌హంస డీవోపీ చేయ‌నున్నారు. మాస్ట‌ర్ విడుద‌ల‌య్యాక ఈ చిత్రం ప‌నులు మొద‌లుకానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *