జ‌క్క‌న స్టార్ హీరోల‌తో క‌లిసి పెద్ద మూవీ….

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ మూవీ దేశ వ్యాప్తంగా ఎన్నో అంచ‌నాల‌ను నెల‌కొల్పుకున్న ఈ పీరియాడిక్ మూవీ ఇప్పుడు అంత‌మ ద‌శ‌లోకి చేరుకుంది. అయితే ఇదే క్ర‌మంలో ఈ మూవీకి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర వార్త‌లే నిపిస్తున్నాయి.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ,మెగా ప‌వ‌ర్‌స్టార్ ఇద్ద‌రి క‌లిసి న‌టిస్తున్న మూవీ ఆర్ ఆర్ ఆర్‌ అలా వాటిలో లేటెస్ట్‌గా వ‌చ్చిందే ఈ మూవీకి హిందీ వెర్ష‌న్ లో అక్క‌డి స్టార్ హీరో ఆమీర్‌ఖాన్ వాయ‌స్ ఓవ‌ర్ ఇస్తున్నార‌ని. ఇప్పుడు ఇదే క్ర‌మంలో మ‌రిన్ని గాసిప్స్ వెల్లువెత్తున్నాయి. హిందీలో లానే ఇత‌ర భాష‌ల్లో కూడా జ‌క్క‌న స్టార్ హీరోల‌తో ఆ వెర్ష‌న్ ల‌లో చేస్తార‌ని టాక్ వ‌స్తుంది. అలాగే తెలుగు వెర్ష‌న్ గాను మెగాస్టార్ చిరంజీవి గాత్రం ఇస్తార‌ని గాసిప్స్ మొద‌ల‌య్యిపోయాయి. అయితే ఇది అమీర్‌వాయిస్ ఓవ‌ర్ ఇస్తార‌ని వ‌చ్చిన వార్త‌ల‌తో అనుబంధంగా వ‌చ్చిన గాసిప్స్ త‌ప్ప అందులో ఇంకా ఏ నిజం లేన‌ట్టు తెలుస్తుంది. మ‌రి దీనిపై క్లారిటీ రావాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *