చిరు మూవీకి హీరోయిని లేన‌ట్టేనా?

latest,buzz,on,megastars,lucifer,remakeఅగ్ర‌హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ ఆచార్య మిగిలి ఉన్న షూట్ ను పూర్తి చేసుకొనే ప‌నిలో ఉన్న ఈ మూవీ లైన్ ల ఉండ‌గానే చిరు మ‌రో రెండు సినిమాల‌ను ఓకే చేసిన‌ట్టు తెలిసిందే. అయితే ఈ రెండు కూడా రీమేక్ సినిమాలు కావ‌డం వాటికి ద‌ర్శ‌కుడు ఎవ‌రో ఫైన‌ల‌జ్ వంటివి చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అయితే చిరు టేక‌స్ చేసిన లూసిఫ‌ర్ రీమేక్ విష‌యంలో మాత్రం ఏదొక ట్విస్ట్ చోటు చేసుకుంటూనే ఉంటుంది. అలా మొద‌ట యంగ్ డైరెక్ట‌ర్ నుంచి వినాయ‌క్ కు సినిమా మారింది. కానీ ఆ త‌రువాత వినాయక్ ఈ చిత్రంలో ఓ హీరోయ‌న్ ను కూడ పెడ‌తార‌ని టాక్ వ‌చ్చింది. కానీ ఈ చిత్రానికి మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు మారాడు అన్న టాక్ కూడా ఈ లోపునే వ‌చ్చేసింది. కానీ ఇప్పుడు మ‌రో టాక్ ప్రకారం ఈ చిత్రంలో మేక‌ర్స్ ఎలాంటి హీరోయిన్‌ను పెట్ట‌డం లేద‌ని తెలుస్తుంది. మ‌రి దీనిపై మ‌రింత స‌మాచారం రావాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *