క్రిష్ మాత్రం ప‌వ‌న్ మూవీపై ర‌కుల్ రిక్విస్ట్‌ను తిర‌స్క‌రించాడ‌ట‌…

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మరియు క్రిష్ కాంబినేష‌న్‌లో మూవీ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ కోసం హీరోయిన్ వేట‌లోప‌డ్డాడ‌ట క్రిష్ . అయితే వైష్ణ‌వ్ తేజ్ తో క్రిష్ చేస్తున్న మూవీలో ర‌కుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ మూవీలో న‌టించేందుకు ఆస‌క్తి చూపించింద‌ట ర‌కుల్‌. ఈ భామ బాలీవుడ్ లో అమితాబ్‌బ‌చ్చ‌న్‌, అజ‌య్‌దేవ్‌గ‌న్‌తో మేడే మూవీ చేస్తోంది. హిందీ మార్కెట్ లో ర‌కుల్ ఇమేజ్ ప్ల‌స్ అవుతుంద‌ట అక్క‌డ మేక‌ర్స్ భావిస్తున్నారు. అయితే క‌థానుగుణంగా హీరోయిన్ల‌ను ఎంపిక చేసుకునే క్రిష్ మాత్రం ప‌వ‌న్ మూవీపై ర‌కుల్ రిక్విస్ట్‌ను తిర‌స్కరించాడ‌ట‌. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం భారీ షిప్ సెట్ ను వేయ‌గా.. భారీ వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న‌ది. సెట్ ఏర్పాటు ప‌నులు పూర్త‌య్యాక ప‌వ‌న్ షూటింగ్‌లో జాయిన్ కానున్న‌ట్టు తెలుస్తోంది. హై బ‌డ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్‌గా ఈ మూవీన్ని ఏఎం ర‌త్నం తెర‌కెక్కిస్తున్నారు. ఏఎం ర‌త్నం -ప‌వ‌న్ కాంబోలోవ‌చ్చిన
మూవీ ఖుషీ ఇండ‌స్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *