ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో కీర్తి సురేష్‌….

కీర్తిసురేష్ అప్ప‌టివ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌లు చేసిన కీర్తి సురేష్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వ‌లో వ‌చ్చిన మ‌హాస‌టి మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ మూవీలో కీర్తి న‌ట‌న‌కు జాతీయ ఉత్త‌మ న‌టిగా పుర‌స్కారం ల‌భించింది. ఈ మూవీ ఇచ్చిన కిక్‌తో కీర్తి వ‌రుస‌గా లేడి ఓరియెంటెడ్ మూవీల‌కు ఓకే చెప్పింది. అందులో భాగంగా వ‌చ్చిన‌వే… పెంగ్విన్‌, మిస్ ఇండియా ,లేటెస్ట్‌గా రాబోతున్న గుడ్ ల‌క్ స‌ఖి. ఇందులో ఇప్ప‌టికే పెంగ్విన్‌, మిస్ ఇండియా మూవీలు ఓటీటీ లో విడుద‌లై పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయాయి. దీంతో మ‌హాన‌టి మూవీ ద్వారా వచ్చిన క్రేజ్ త‌గ్గుతోంది. దీనికి తోడు కీర్తికి ఇంత‌కు ముందు బొద్దుగా ముద్దుగా ఉండేది, కానీ మిస్ ఇండియా మూవీలో స‌న్న‌గా..మ‌రి మొఖంలో క‌ళ లేకుండా పోయింది. ఏది ఏమైనా వ‌రుస‌గా మూవీలు ఇలా దెబ్బ కొడుతుంటే త‌ట్టుకోలేక‌పోతుంది. కీర్తి ఆమె నుండి రాబోతున్న గుడ్ ల‌క్ స‌ఖి అయినా హిట్ అవుతుందోలేదో… ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమంటే.. గుడ్ ల‌క్ స‌ఖి కూడా ఓటీటీలో విడుద‌ల‌కానున్న‌ట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈసినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు న‌గేష్ కు కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి శ్రావ్య వ‌ర్మ స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. న‌గేష్ కు కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ కేవ‌లం తెలుగు లో మాత్రమే కాకుండా, త‌మిళ్,మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌కానుంది. ఈ మూవీ లో కీర్తి సురేష్ ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తోంది. ఇక ఈ మూవీలో కీర్తి సురేష్‌తో పాటు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నున్నారు. కీర్తి సురేష్ షూట‌ర్‌గా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *