కేజీయ‌ఫ్‌-2 లాస్ట్ సీన్ కోస‌మే భారీ ఖ‌ర్చు…

ప్ర‌స్తుతం వ‌స్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ పాన్ ఇండియ‌న్ మూవీల్లో క‌న్న‌డ స్టార్ హీరో యష్ మ‌రియు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ల కాంబిష‌న్‌లో వ‌స్తున్న కేజీయ‌స్ చాప్ట‌ర్‌-2 కూడా ఒక‌టి. లేటెస్ట్‌గా వ‌చ్చిన టీజ‌ర్‌తో ఈ మూవీపై అంచ‌నాలు ఒక రేంజ్‌లో పెరిగిపోయాయి. ఒక్క‌క‌న్న‌డ తెలుగులోనే కాకుండా అన్ని కీల‌క ఇండ‌స్ట్రీల‌లో కూడా ఈ మూవీపై నెవ‌ర్ బిఫోర్ అంచ‌నాలు నెల‌కొన్నాయి. చాప్ట‌ర్‌1 ఊహ‌ల‌కు అంద‌ని హిట్ కావ‌డంతో చాప్ట‌ర్ 2పై ఈ స్థాయి అంచ‌నాలు నెల‌కొన్నాయి. భారీ అంచ‌నాలు సెట్ చేసుకున్న ఈ మూవీలో క్లైమాక్స్ ఎంత కీల‌క‌మో తెలిసిందే. బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ చేసిన అధీర పాత్ర‌కు మ‌రియు రాకీభాయ్ కు ఉండే భీక‌ర పోరాట స‌న్నివేశం ఏస్థాయిలో ఉంటుందా అని ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. మ‌రి ఈ ఒక్క క్లైమాక్స్ సీన్ కోస‌మే నిర్మాణ సంస్థ హోంబ‌లే వారు భారీ ఎత్తున ఖ‌ర్చు చేశార‌ట‌. అలాగే ఈ మూవీకి 100 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ ఖ‌ర్చు అయ్యిన‌ట్టు తెలుస్తుంది. మ‌రి ఈ భారీ మూవీ మాత్రం దీని బ‌డ్జెట్ కు మినిమం ఐదింత‌లు ఖ‌చ్చితంగా రాబ‌ట్టేయ‌డం గ్యారంటీ అని చెప్పాలి. మ‌రి ఈ బిగ్గెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ను మేక‌ర్స్ ఎప్పుడు విడుద‌ల చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *