ఎన్టీఆర్ మూవీలో యంగ్‌హాట్ బ్యూటీ….

kethikasharma,in,jrntr,and,trivikram,filmటాలీవుడ్ అల వైకుంఠ‌పుర‌ములో ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రెడీగా ఉన్నారు. అర‌వింద స‌మేత త‌రువాత మ‌రోసారి ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ రిపీట్ కాబోతోన్న విష‌యం తెలిసిందే. అయితే ప‌రిస్థ‌తిల‌న్నీ బాగుండి ఉంటే ఈ చిత్రం ఈ స‌రికే సెట్స్‌పై ఉండేది. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి రూపంలో లాక్‌డౌన్ ఏర్ప‌డి..షూటింగ్స్ అన్నీ ఎక్క‌డివ‌క్క‌డ ఆగిపోయాయి. అందువ‌ల్లే.. ఎన్టీఆర్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇటీవ‌ల ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొద‌లై య‌మాస్పీడుగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. కాబ‌ట్టి.. త్వ‌ర‌లోనే ఎన్టీఆర్; త‌్రివిక్ర‌మ్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవ‌కావం ఉంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ల విష‌యంలో అనేకానేక వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. త్రివిక్ర‌మ్‌.. ఈ చిత్రంలో కూడా త‌న అర‌వింద స‌మేత అల‌వైకుంఠ‌పుర‌ములో చిత్రాల హీరోయిన్ పూజా హెగ్డేనే రిపీట్ చేస్తాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. మ‌రో ఇద్ద‌రు ముగ్గురు పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు మ‌హాన‌టి కీర్తిసురేష్‌ని సంప్ర‌దిస్తున్న‌ట్లుగా టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంంది. ఇప్ప‌టికే కేతికా శ‌ర్మ‌ని సంప్రదించార‌ని అంటున్నారు. ఆకాష్ పూరి రొమాంటిక్ చిత్రంలో న‌టిస్తోన్న కేతికా.. త గ్లామ‌ర్ ఫొటోల‌తో కుర్ర‌కారుకి కునుకు లేకుండా చేస్తున్న విష‌యం తెలిసిందే. త్రివిక్ర‌మ్ క్రియేట్ చేసిన గ్లామ‌ర్ పాత్ర‌కు కేతికా అయితే ప‌ర్పెక్ట్‌గా సెట్ అవుతుంద‌ని భావించ‌డ‌మే కాదు… దాదాపు ఆమెను ఫైన‌ల్ చేసిన‌ట్లుగా కూడా వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *