కాజ‌ల్‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్లే..

తెలుగు ఇండ‌స్ట్రీలోమంచి పేరు తెచుకున్న భామ కాజల్ అగ‌ర్వాల్. స్టార్ హీరోయిన్ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇప్ప‌టికీ మంచి డిమాండ్ ఉంది. అయితే చాలా కాలంగా వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లుతో ప్రేమాయ‌ణం సాగించిన కాజ‌ల్ మొత్తానికి 2020 అక్టోబ‌ర్ 30న అత‌డిని వివాహం చేసుకుంది. పెళ్లి అయ్యాక ఇక హీరోయిన్ల‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రావు. కానీ కాజ‌ల్‌కు మాత్రం వ‌రుస అవ‌కాశాలు ఉన్నాయి. ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్ చేతిలో ఇప్ప‌టికే ముంబైసాగా, ఇండియ‌న్‌2 ,ఆచార్య‌మూవీలు ఉన్నాయి. పైగా ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌-మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తుపాకి2లో కూడా కాజ‌ల్‌నే క‌థానాయిక‌. ఇలా మొత్త నాలుగులు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆమె చేతికి మ‌రో భారీ మూవీ త‌మిళ్ స్టార్ హీరో సూర్య మాస్ డైరెక్ట‌ర్ హ‌రి కాంబినేష‌న్‌లో రాబోతున్న మూవీ కూడా వెళ్లింది. అలాగే విక్ర‌మ్ మూవీలో కూడా కాజ‌ల్ నే హీరోయిన్ గా తీసుకోబోతున్నార‌ట‌.విజ‌య్,సూర్య‌, విక్ర‌మ్ మూవీల కోసం తమిళ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి మూవీల్లో కాజ‌ల్ హీరోయిన్ అంటే. క‌చ్చితంగా కాజ‌ల్ ఇవి బంఫ‌ర్ ఆఫ‌ర్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *