ఓహార‌ర్ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌నుంద‌ట‌..

టాలీవుడ్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ రీసెంట్ గా గౌత‌మ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. పెళ్లి త‌రువాత అస‌లు కాజ‌ల్ సినిమాలు చేస్తుందా? అనే సందేహం చాలా మందికి వ‌చ్చింది. అయితే అప్ప‌ట్లోనే కాజ‌ల్ త‌న కేరిర్‌కు సంబంధించిన క్లారిటీ ఇచ్చేసింది. న‌చ్చిన మూవీలు మాత్ర‌మే చేస్తాన‌ని మాత్ర‌మే చెప్పిన కాజ‌ల్ ఇప్పుడు క‌మిట్ అయిన చిత్రాల‌ను పూర్తి చేయాల్సి ఉంది. వీటితో క‌మ‌ల్ హాస‌న్ ఇండియ‌న్‌2 చిరంజీవి ఆచార్య దుల్కార్ స‌ల్మాన్ మూవీలున్నాయి. హానీమూన్ ట్రిప్ పూర్త‌యిన త‌రువాత కాజల్ సెట్స్‌లోకి వెళ్ల‌డానికి ఓకే చెప్పేసింది. ఈనేప‌థ్యంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఓకొత్త మూవీ చేయ‌నుంది. వివ‌రాల మేర‌కు డైరెక్ట‌ర్ డీకే తెర‌కెక్కించే ఓ హార‌ర్ చిత్రంలో కాజ‌ల్ అగర్వాల్ న‌టించ‌నుంద‌ట‌. హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన కాజ‌ల్ ఇన్నేళ్ల‌లో ఓ హార‌ర్ చిత్రంలోనూ న‌టించ‌లేదు. తొలిసారి ఓ హార‌ర్ సినిమాలో న‌టించ‌డానికి ఓకే హార‌ర్ సినిమాలో న‌టించ‌డానికి ఓకే చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *