ఎన్టీఆర్ అభిమానుల‌కు బ‌హిరంగ లేఖ …

టాలీవుడ్ అగ్ర‌హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఈ సంవ‌త్స‌రం త‌న పుట్టిన రోజు నాడు మే20 ఏ విధ‌మైన వేడ‌క‌లు చేయ‌వ‌ద్ద‌ని సూచించారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కొల్ల‌గొట్టుకపోతుంది.ఇలాంటి త‌రుణంలో ఏలాంటి సంబ‌రాలు చేయ‌వ‌ద్దు, ఈ మేర‌కు నేడు ఉద‌యం ఆయ‌న ఓప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వేడుక‌ల‌కు ఇది స‌రైన స‌మ‌యం కాద‌ని.. ప్ర‌తిఒక్క‌రూ లాక్‌డౌన్ నియమాలు పాటించి ఇంటికే ప‌రిమితం కావాల‌ని కోరారు.ఇప్పుడు తాను ఆరోగ్యంగా ఉన్నానని ,త‌ర్వ‌లోనే కొవిడ్ నుండి పూర్తిగా కోలుకుంటాన‌ని పేర్కొన్నారు. ఇక‌, మూవీల సంగ‌తికి వ‌స్తే ఇప్పుడు తారక్ ఆర్ఆర్ ఆర్ లో న‌టిస్తున్నారు. సుమారు రూ450 కోట్ల భారీ బడ్జెట్ తో మూవీ రూపుదిద్దుకుంటోంది. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీలో రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్నాడు. బాలీవుడ్ ,హాలీవుడ్ తార‌లు ఇందులో కీల‌కపాత్ర‌లు పోషిస్తున్నారు.ఆర్ఆర్ ఆర్ త‌రువాత ఎన్టీఆర్ .. కొర‌టాల‌శివ‌తో ఓ మూవీ ప‌ట్టాలెక్కించే అవ‌కాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *