త్రివిక్ర‌మ్, తార‌క్‌ల కాంబోస్టార్ట్ అవ‌డానికి ముహోర్తం ఖ‌రారు…

టాలీవుడ్ అగ్ర‌హీరో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రియు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అర‌వింద స‌మేత మూవీ ఎంత మంచి విజ‌యాన్ని అందుకున్న విష‌యం తెలిసిందే. ఇంకా ఈ మూవీతో వీరి కాంబినేష‌న్ నుంచి మ‌రో మూవీ రావాల‌ని కోరుకున్నారు మ‌రి ఆ టైం లోనే వీరి క‌ల‌యిక‌లో మ‌రో మూవీ కూడా ప్ర‌క‌టించారు. అక్క‌డి నుంచి మంచి అంచనాలు నెల‌కొల్పుకున్నా ఈ మూవీకి అయిన‌నూపోయి రావ‌లెహ‌స్తిన‌కు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. కానీ ఈమూవీ ఎప్పుడు మొద‌ల‌కానుంది అన్న‌ది ఇంకా క్లారిటీ రాని నేప‌థ్యంలో ఎన్టీఆర్ రాజ‌మౌళితో ఆర్ ఆర్ ఆర్ బిజీగా అయ్యిపోయాడు. అయితే ఇక ఇదిలా ఉండ‌గా త్రివిక్ర‌మ్ మ‌రియు తార‌క్‌ల కాంబోస్టార్ట్ అవ‌డానికి ముహోర్తం ఖ‌రారు అయ్యిన‌ట్టు తెలుస్తుంది. ఈ మూవీ తాలూకా పూజా కార్య‌క్ర‌మాన్ని చిత్ర యూనిట్ ఈ సంక్రాంతికే ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆరోజు సాధార‌ణ పూజా కార్య‌క్ర‌మంను జ‌రుపుకొని
ఎన్టీఆర్ పూర్తిగా ఫ్రీ అయ్యాక ఈ ప్రాజెక్ట్ ను పూర్తి స్థాయిలో ప‌ట్టాలెక్కించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *