ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో మూవీ తీసుకురానున్న‌ట్టు టాక్…

టాలీవుడ్ యంగ్ హీరోలు రామ్‌చ‌ర‌ణ్ మ‌రియు ఎన్టీఆర్ మ‌ల్టీస్టార్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ అంద‌రికి తెలిసిన విష‌య‌మే.ఇప్పుడు హైద‌రాబాద్‌లో క్లైమాక్స్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. భీం, రామ‌రాజులు ల‌క్ష్య సాధ‌న కోసం చేసే ఫైట్ మూవీకే హైలైట్‌‌గా మార‌నుంద‌ని టాక్‌. మూవీ షూటింగ్ మ‌రి కొద్ది రోజుల‌లో ముగియునున్న నేప‌థ్యంలో ఆర్ ఆర్ ఆర్ టీం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టింది.సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న మూవీల‌లో ఆర్ ఆర్ ఆర్ ఒక‌టి. క‌రోనా లేక‌పోయి ఉండి ఉంటే ఈ మూవీ జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది. కాని క‌రోనా వ‌ల‌న 8 నెల‌లు షూటింగ్స్ అన్నీ స్తంభించ‌డంతో ఆర్ ఆర్ ఆర్ రిలిజ్ వాయిదా ప‌డింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో మూవీ తీసుకురానున్న‌ట్టు టాక్‌. తాజాగా మూవీ రిలీజ్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 13న మూవీ విడుద‌ల కానున్న‌ట్టు తెలియ‌జేస్తూ రిలీజ్ డేట్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో తార‌క్ బుల్లెట్‌పై దూసుకుపోతుండ‌గా, రామ్‌చ‌ర‌ణ్ గుర్ర‌పు స్వారీ చేస్తున్నారు. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీలో తార‌క్ కొమురం భీంగా క‌నిపించ‌నుండ‌గా, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు న‌టిస్తున్నారు. తెలుగు మూవీ ఖ్యాతిని పెంచే చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ నిలుస్తుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *