రాజ‌కీయాల పై మ‌రోసారి తీరిగ్గా కాఫీ తాగుతూ మాట్లాదాం….

టాలీవుడ్ అగ్ర‌హీరో ఎన్టీఆర్ మ‌ల్టీస్టార్ మూవీ రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్నా విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇటు వెండితెర‌పై సంద‌డి చేస్తూనే అడ‌పాద‌డ‌పా బుల్లితెర‌పై ప‌లు రియాలిటీ షోస్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే బిగ్‌బాస్ అనే కార్య‌క్ర‌మంతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే షోతో థ్రిల్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రి కొద్ది రోజుల‌లో ప్రసారం కానున్న ఈ కార్య‌క్ర‌మం ప్రమోష‌న్ లో భాగంగా ఎన్టీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్ లో ప‌లు అంశాల గురించి ప్ర‌స్తావించారు. రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం ఎప్పుడు చేయ‌బోతున్నారంటూ ఓ విలేక‌రి ఎన్టీఆర్‌ని ప్ర‌శ్నించ‌గా, దానికి తెలివైన స‌మాధానం ఇచ్చారు జూనియ‌ర్. ఈ ప్ర‌శ్న‌కు మీరే జ‌వాబు చెప్పాలి. మీ ప్ర‌శ్న‌కు నేను ఏ స‌మాధానం చెబుతానో తెలుసు కదా అని అన్నారు. రాజ‌కీయాల గురించి మాట్లాడేందుకు ఇది స‌మ‌యం , సంద‌ర్భం కాదు. అని గురించి మ‌రోసారి తీరిగ్గా కాఫీ తాగుతూ చ‌ర్చించుకుందామ‌ని ఎన్టీఆర్ వెల్ల‌డించారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ అనే మూవీతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇందులో భీం పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *