జోరు పెంచిన‌ వెంక‌టేష్ …


టాలీవుడ్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ నార‌ప్ప అనే మూవీ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన అసుర‌న్ మూవీకు రీమేక్ త‌మిళంలో ధ‌నుష్ పోషించిన ఈ పాత్ర‌ను తెలుగులో వెంక‌టేష్ చేస్తున్నారు. ఈ మూవీలో వెంక‌టేష్ స‌ర‌స‌న ప్రియ‌మ‌ణి న‌టిస్తుంది. మ‌రో హిరోయిన్‌గా మ‌ల‌యాళీ బ్యూటీ రెబ్బా మౌనిక ను ఎంపిక చేశారు. ఇక సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు ఫెమ్ శ్రీ‌కాంత్ అడ్డాల ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ మూవీ మొద‌టి షెడ్యూల్ త‌మిళ‌నాడు తిరుచందూర్ తెర‌కాడులోని రెడ్ డెస‌ర్ట్ ప్రాంతంలో కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఆత‌రువాత క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగిపోయింది.ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. ఈమూవీ తాజా షెడ్యూల్ వికారాబాద్ అడవుల్లో ప్రారంభ‌మైంది.15 రోజులు పాటు నాన్ స్టాప్‌గా ఈ షెడ్యూల్ కొనసాగ‌నుంది. ఈ షెడ్యూల్‌లో వెంక‌టేష్‌తో ప‌లు కీల‌క సన్నివేశాల‌తో పాటు యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సంవ‌త్స‌రం చివ‌రి క‌ల్లా సినిమా చిత్ర‌క‌ర‌ణ పూర్తి కానుండ‌గా వ‌చ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *