బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమేనా!

హైద‌రాబాద్‌: బుమ్రా మ్యాచ్‌ల‌కు దూరంగా ఉన్నాడ‌ని కొన్నాళ్లుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బీసీసీఐ వ‌ర్గాలు కూడా బుమ్రా పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తెలిపాయి. అయితే బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవ‌ర‌నే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. ఇండియా స్పీడ్‌స్ట‌ర్ జ‌ప్‌ప్రీత్ బుమ్రా నాలుగో టెస్ట్‌తో పాటు ప‌లు వ‌న్డేలు, టీ20ల నుండి వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌లన వైదొలిగాడు.కేర‌ళ కుట్టి అనుప‌మ‌ప‌రమేశ్వ‌ర‌న్ తో బుమ్రా వివాహం జ‌ర‌గ‌నుందంటూ నెటిజ‌న్స్ జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు. కొన్నాళ్లుగా వీరిద్ద‌రి మ‌ధ్య ఏదోవ్య‌వ‌హారం న‌డుస్తుంద‌ని, బుమ్రా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫాలో అయ్యే ఒకే ఒక్క హీరోయిన్ అనుప‌మ‌నే కావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో రిలేష‌న్ ఉంద‌నే అభిప్రాయానికి నెటిజ‌న్స్ వ‌చ్చారు. అనుప‌మ కూడా ప‌లుమార్లు త‌న‌కు బుమ్రా అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. మ‌రి అనుప‌మ‌ని బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని వ‌స్తున్న వార్త‌ల‌లోఎంత నిజం ఉంద‌నేది తెలియాలంటే కొంత కాలం ఆగ‌వల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *