పవ‌ర్‌స్టార్ తో శ్రీ‌లంక భామ….

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ,క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. చ‌క్క‌ని డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలున్నాయి. ఈ ప్రాజెక్టులో ఫీమేల్ లీడ్ రోల్ లో ఎవ‌రు క‌నిపిస్తార‌నే దానిపై ఇప్ప‌టివ‌ర‌కు ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు తెర‌పైకి వ‌చ్చాయి. క‌థానుగుణంగా ఈ మూవీలో ఇద్ద‌రు హీరోయిన్లుండ‌గా ..క్రిష్ అండ్ టీం ఇప్ప‌టికే నిధి అగ‌ర్వాల్‌ను ఓ హీరోయిన్‌గా ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌క‌టిచింది. మ‌రో హీరోయిన్ గా బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును ఫైన‌ల్ చేసిన‌ట్టు మూవీ ఇండ‌స్ట్రీలో టాక్‌. దానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నున్న‌ట్టు తెలుస్తోంది. జాక్వెలిన్ ఇంత‌కు ముందు ఎప్పుడు క‌నిపించ‌న్న‌ట్టువంటి రోల్‌లో క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. డైరెక్ట‌ర్ క్రిష్ కు బాలీవుడ్ తో మంచి కాంట‌క్ట్స్ ఉండ‌టంతో జాక్వెలిన్‌ను కీల‌క పాత్ర కోసం డేట్స్ స‌ర్దుబాటు చేసే ప‌నిలో ఉన్న‌ట్టు చ‌ర్చ న‌డుస్తోంది. జాక్వెలిన్‌కు ఇప్ప‌టికే ఎన్టీఆర్ హీరోగా న‌టించిన రామ‌య్యా వ‌స్తావ‌య్యా మూవీలో స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసింది. ఈశ్రీ‌లంక భామ ఈ సారి పూర్తి స్థాయి రోల్‌తో తెలుగు అభిమానుల‌ను అల‌రించేందుకు రేడీ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *