మేక‌ర్స్ నుంచి అయినా స‌రే అప్డేట్ ఉందా లేదా…

ఇప్పుడు టాలీవుడ్ ఫీ‌ల్మ్ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా శృతిహాస‌న్ హీరోయిన్ గా బాలీవుడ్ హిట్ మూవీ పింక్‌కు రీమేక్ గా తెర‌కెక్కిస్తున్న మూవీ వ‌కీల్‌సాబ్ ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్‌వేణు తెర‌కెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ప‌వ‌న్ బ్యాక్ మూవీ కావ‌డంతో దీనిపై అన్ని అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఈ మూవీ నుంచి టీజ‌ర్ కోసం ఎప్ప‌టి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో మిస్స‌యిన ఈ ట్రీట్ ను మేక‌ర్స్ ఫైన‌ల్‌గా కొత్త ఏడాది కానుక‌గా అందివ్వ‌నున్నాని టాక్ బ‌య‌ట‌కొచ్చిన విష‌యం తెలిసిందే. కానీ ఈ సంగ‌తిపై మాత్రం ఇంకా ఎలాంటి మూమెంట్ లేన‌ట్టే తెలుస్తుంది. దీనితో మ‌ళ్లీ అనుమానాలు మొద‌ల‌య్యాయి. మేక‌ర్స్ నుంచి ఈసారి అయినా స‌రే అప్డేట్ ఉందా లేదా అన్న‌ది మిస్ట‌రీగా మారింది. ఇప్ప‌టికే ప‌వ‌న్ అభిమానులు స‌రైన అప్డేట్ ఒక‌టి లేక చాన్నాళ్ల నుంచి స‌త‌మ‌త‌మ‌వుత‌న్నాయి. మ‌రి మేకర్స్ నుంచి ఈ టీజ‌ర్ ఇప్పుడ‌ప్పుడే వ‌చ్చే సూచ‌న‌లు కూడా ఇంకా క‌నిపించ‌డం లేదు. మ‌రి ముందు రోజుల్లో ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.గీతం అంద‌జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *