వేదాళం రీమేక్ ఆల్రెడీ ప్రొగ్రెస్‌లో ఉందా?

టాలీవుడ్ అగ్ర‌హీరో చిరంజీవి హీరోగా బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో ఆచార్య అనే మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాలు నెల‌కొల్పుకున్న ఈ మూవీ ఇప్ప‌టికే కొంత‌మేర షూటింగ్ పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఈ మూవీ ఇంకా లైన్‌లో ఉండ‌గానే చిరు మ‌రో రెండు క్రేజీ రీమేక్ మూవీల‌ను కూడా లైన్‌లో పెట్టుకున్నారు. అవి ఏంటో కూడా అంద‌రికీ తెలిసిందే. అయితే విటీలో సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు మోహ‌ర్‌ర‌మేష్ తో ప్లాన్ చేస్తున్న వేదాళం రీమేక్ ఆల్రేడి ప్రొగ్రెస్ లో ఉంద‌ని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో క‌థానుసారం కోల్‌క‌త్తా లోకొన్ని కీల‌క సీన్స్ ఉంటాయి. వాటిని మేక‌ర్స్ తీసిన‌ట్టు తెలుస్తుంది. అయితే వాటికి చిరు ఉండాల్సిన స్పేస్‌లేదు. అందుకే ముందు వాటిని ప్లాన్ చేసుకున్నార‌ని సినీ వ‌ర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. మ‌రి దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సిఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *