ఈ ఇద్ద‌రి పెళ్లిపై అనుప‌మ త‌ల్లి చెక్ పెట్టేసారు..

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుస‌మ‌ప‌ర‌మేశ్వ‌రన్ కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తితెలిసిందే. అలాగే ప్ర‌స్తుతం ప‌లు ఆస‌క్తిక‌ర మూవీల్లో తాను న‌టిస్తుంది. మ‌రి ఇదిలా ఉండ‌గా మ‌న ఇండియ‌న్ క్రికెట్ టీం యార్క‌ర్ స్పెష‌లిస్ట్ బుమ్రాకు ఈమెకు రిలేష‌న్ ఉంది అని ఎప్ప‌టి నుంచి రూమ‌ర్స్ ఉన్న విషయం తెలిసిందే. దీనిపై స‌రైన ఆధారాలు లేవు కానీ ఓ టాక్ అయితే ఉంది. లేటెస్ట్ నాలుగైదు రోజులు నుంచి అయితే ఈ ఇద్ద‌రికీ కొన్ని సంఘ‌ట‌న‌లు వేర్వేరుగా యాదృచ్చికంగా క‌ల‌వ‌డంతో వీరిద్ద‌రి పెళ్లికి నిశ్చ‌యం అయ్యింద‌ని రూమ‌ర్స్ ఒక్క‌సారిగా గుప్పుమ‌న్నాయి. అనుప‌మ గుజ‌రాజ‌త్ లోని ద్వార‌క‌కు వెళ్తున్నాని అలాగే మ‌రో ప‌క్క బుమ్రా కూడా తాను గుజ‌రాత్ వెళ్తున్న‌ట్టుగా త‌మ సోష‌ల్ మీడియాలో తెలిపారు. దీనితో అక్క‌డ నుంచి మొద‌ల‌య్యింది రచ్చ‌. వీళ్ళ‌కి పెళ్లి ఫిక్స్ అయ్యిపోయింది అని అనేక ర‌కాల రూమార్స్ ఈనాలుగు రోజుల గ్యాప్ లో ఓరేంజ్ లో వైర‌ల్ అయ్యాయి. కానీ ఈ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అనుప‌మ‌త‌ల్లి చెక్ పెట్టేసారు. ఓ మ‌ళ‌యాళం పోర్ట‌ల్‌తో మాట్లాడుతూ అస‌లు ఇదంతా చెత్త అని ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజ‌మూ లేద‌ని అను త‌న ఓ తెలుగు మూవీ షూట్ నిమిత్తం వెళ్ళింది త‌ప్పితే వేరే ఏం లేద‌ని ఆమె క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *